సరియైన పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామని నారాయణఖేడ్ ఎస్ఐ రావుల శ్రీశైలం అన్నారు. శనివారం నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాజీవ్ చౌక్ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపొద్దని సూచించారు. చిన్నపిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. పలు వాహనాలు తనిఖీ చేసి పత్రాలు లేనివారికి చలానా వేసి, పాత చాలనాలు కట్టించారు.