నారాయణఖేడ్ పట్టణంలో మాఘశుద్ధ సప్తమి మంగళవారం రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూర్య భగవానుడికి ఇళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలు పాఠశాలల విద్యార్థులు సూర్య భగవానునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సూర్య నమస్కారాలు చేశారు. సూర్య నమస్కారాలు చేయడం వల్ల శారీరక శ్రమతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఉపాధ్యాయులు తెలిపారు.