నారాయణఖేడ్‌లో ఆర్టిఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి: సిపిఐ

50చూసినవారు
నారాయణఖేడ్‌లో ఆర్టిఓ కార్యాలయం ఏర్పాటు చేయాలి: సిపిఐ
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆర్టీవో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు చిరంజీవి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సిపిఐ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఆర్టిఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రేపు సంతకాల సేకరణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోటార్ వెహికల్ రిజిస్ట్రేషన్ కోసం జహీరాబాద్ వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్