సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగులు ఐబి నుంచి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దత్తు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతున్నది పేర్కొన్నారు. ర్యాలీలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శేషాద్రి , జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్ చారి, మీరాబాయి, కవిత , లక్ష్మణ్, నాగరాజు ఉన్నారు.