సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎస్ఐ కార్యాలయంలో గురువారం ఖేఢ్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ శ్రీశైలం ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. పీస్ కమిటీ సమావేశంలోఖేఢ్ డీఎస్పీ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం డిఎస్పీ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో హోలీ, పవిత్ర రంజాన్ పండుగలు జరుపుకోవాలన్నారు. సంబంధంలేని వారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.