సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం, మున్సిపల్ పట్టణ పరిధిలోని శ్రీ సత్యనారాయణ స్వామి మందిరం వద్ద ఆంజనేయ స్వామి మందిరంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీ ఆంజనేయ స్వామి వారికి మధుకర్ పంతులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలను భక్తులకు వడ్డించారు. ఈ కార్యక్రమంలో చెన్నై స్వామి, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.