సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూరు మండలం మైకొడు గ్రామ ప్రజలకు శుక్రవారం యూత్ కాంగ్రెస్ నాయకులు బిరాదర్ శివకుమార్ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ మైకోడ్ గ్రామ ప్రజల జీవితాల్లో కొత్త రంగులను నింపాలని బిరాదర్ శివకుమార్ ఆకాంక్షించారు. కృత్రిమ రంగులను ఉపయోగించకుండా సహజమైన రంగులను ఉపయోగించాలని తెలిపారు. ఈ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని శివకుమార్ తెలిపారు.