సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో శనివారం యాసంగి జొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతుల పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతులకు ఎల్ల వేళల అండగా ఉంటూ రైతులకు కావలసిన వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ ద్వారా అందిస్తున్నాం అన్నారు.