సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల కేంద్రం, మండల పరిధిలోని కొత్తగా పట్టా పాస్ బుక్ పొందిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలని సిర్గాపూర్ వ్యవసాయ అధికారి ఏవో హరికృష్ణ గురువారం సూచించారు. అలాగే ప్రభుత్వ ఆదేశాల మేరకు 06. 06. 2025 వరకు పట్టా పొందిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. రైతు భరోసాకు చివరి తేదీ 20. 06. 2025. దరఖాస్తు ఫారం, పట్టా పాస్ బుక్ జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ లు సంబంధిత ఏఈఓలకు సమర్పించాలని తెలిపారు.