సంగారెడ్డి: 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం, భజనలు

69చూసినవారు
సంగారెడ్డి పట్టణంలోని సిద్ధార్థ నగర్ లో ఆదివారం భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆంజనేయస్వామికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి మహా నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తిశ్రద్ధలతో చాలీసా పారాయణం, భజనలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

సంబంధిత పోస్ట్