
మాజీ మంత్రి కాకాణికి సుప్రీంలో ఎదురుదెబ్బ
AP: క్వార్ట్జ్ అక్రమాల కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణాపై పొదలకూరు పీఎస్లో ఆయనపై కేసు నమోదైంది. కాగా, ప్రస్తుతం కాకాణి పరారీలో ఉన్నారు.