పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని.. ప్రతి ఒక్కరూ పొగాకు వాడకంపై అవగాహన కలిగి ఉండాలని బుధవారం జిల్లా పొగాకు నియంత్రణ విభాగం సూపర్‌వైజర్ విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. బాచేపల్లి, మాసనుపల్లిలో జాతీయ పొగాకు నియంత్రణ కార్యక్రమంలో భాగంగా యువకులు, పొగాకు సేవించే వారికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయలు, విద్యార్ధినిలు తదితరులు పాల్గొన్నారు.