
బాలికపై లైంగికదాడి.. నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
TG: ఏడేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలానికి చెందిన మామిడి పాపారావు(30)కు అనే వ్యక్తి ఏడేళ్ల బాలికపై ఓ దారుణానికి ఒడిగట్టాడు. 2023 ఆగస్టు 13న బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా పాపారావు తన ఇంటికి తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. కేసును పరిశీలించిన కోర్టు నేరం రుజువు కావటంతో నిందితుడికి జైలుశిక్షతోపాటు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.