ప్రతి ఒక్క విద్యార్థిని లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ అన్నారు. సంగారెడ్డి లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థినికి క్రమశిక్షణ ఉండాలని పేర్కొన్నారు. అధ్యాపకులు చెప్పిన పాఠాలు శ్రద్ధగా వినాలని చెప్పారు. సమావేశంలో కళాశాల ప్రిన్సిపల్ అరుణ బాయి పాల్గొన్నారు.