నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల పరిధిలోని నాగూర్ కే ప్రాథమిక పాఠశాల యందు శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ మహానంద మరియు పాఠశాల ఉపాధ్యాయులు, పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క ప్రత్యేకతల గురించి వివరించడం జరిగింది.