జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు రేపు యధావిధిగా నడుస్తాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. రెండో శనివారం అయినా షెడ్యూల్ ప్రకారం సెలవు లేదని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు గమనించాలని కోరారు.