రోడ్డు కోసం శ్యామా తండావాసుల ధర్నా

1చూసినవారు
నారాయణఖేడ్ మండలం హంగీర్గ గ్రామం వద్దగల శ్యామా తండావాసులు శనివారం ధర్నా నిర్వహించారు. తమ తండాకు వెళ్లే రహదారిని కొందరు జేసీబీతో తవ్వేయడంతో తాండవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శ్యామా తండాకు ఉన్న రహదారిని యథాతథంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్