వెటర్నరీ హాస్పిటల్లో ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని జిల్లా వెటర్నరీ ఆఫీసర్ శ్రీనివాస్ శెట్టి అన్నారు. కంగ్జిని సందర్శించిన ఆయన వెటర్నరీ అధికారులపై రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుకు విచారణ చేశారు. వెటర్నరీ అసిస్టెంట్, సబ్ ఆర్డినేట్ పోస్టులు ఖాళీ ఉండటంతో పశువులకు వైద్య సేవలు అందకపోవడం విచారకరమన్నారు. విషయాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తామని తెలిపారు.