ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం!
ఏపీ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ‘చంద్రన్న మదర్సా నవీన విద్యా పథకం’ అనే స్కీమ్ ద్వారా మదర్సాల్లో 555 మంది విద్యా వాలంటీర్ల నియామకానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి రూ.13 కోట్లు ఖర్చు చేయనున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 185 మదర్సాల్లో ప్రతి మదర్సాకు ముగ్గురు వాలంటీర్లను నియమించనున్నారు. ఈ పథకం ద్వారా ఎంపికైన వారికి నెలకు రూ.30 వేలు అందించనుంది.