మండలంలోని పలుగుతండాలో రూ. 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి కాలేదని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మాజీ సభ్యులు రవీందర్ నాయక్ శనివారం అన్నారు. రుణమాఫీ కాకపోవడంతో బ్యాంక్ అధికారులు బాకీ చెల్లించాలని లబ్ధిదారులకు నోటీసులు పంపినట్లు తెలిపారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం స్పందించి తండాలో రుణమాఫీ చేయాలని రవీందర్ నాయక్ డిమాండ్ చేశారు.