మునుగోడు ఉప ఎన్నికల్లో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 30 వేల మెజార్టీతో గెలుపు ఖాయమని సిర్గాపూర్ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సంజీవ్ పాటిల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. కెసిఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక కాంగ్రెస్, బిజెపి నాయకులు అడ్డుపడుతున్నారని విమర్శించారు. సొంత లాభం కోసం రాజీనామా చేసి టిఆర్ఎస్ పార్టీ పై అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటని, బిజెపి ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా చేసిన మునుగోడు లో టిఆర్ఎస్ గెలుపు ఖాయమని తెలిపారు.