ఇందిరమ్మ ఇళ్లు మంజూరై, పునాది పనులు చేపట్టలేని స్థితిలో ఉన్న నిరుపేదలకు ఆయా గ్రామ డ్వాక్రా గ్రూపుల ద్వారా రూ. 1 లక్ష సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ. ఖేడ్ పట్టణంలో 240 మందికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామన్నారు. కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలని లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.