కొండాపూర్ లో కొనసాగుతున్న కుస్తీ పోటీలు

75చూసినవారు
నారాయణఖేడ్ మండలం కొండాపూర్ లోని హనుమాన్ దేవాలయంలో గత రెండు రోజులుగా హనుమాన్ జయంతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. మొదటిరోజు హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం జాతర కార్యక్రమాలు కొనసాగాయి. రెండవ రోజు ఆదివారం కుస్తీ పోటీలను నిర్వహించారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ నుండి మల్లయోధులు వచ్చి ఈ కుస్తీ పోటీలలో పాల్గొంటున్నారు. కుస్తీ పోటీల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్