పదవ తరగతి పరీక్ష ఫీజు గడువును డిసెంబర్ ఐదవ తేదీ వరకు పెంచినట్లు సంగారెడ్డి జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు నేరుగా పాఠశాలలో ప్రధానోపాధ్యానికి పరీక్ష ఫీజును చెల్లించాలని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.