

కిటికీకి వేలాడుతూ కనిపించిన బాలిక.. చివరికి (వీడియో)
మహారాష్ట్రలోని పుణెలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కట్రాజ్ ప్రాంతంలో భావిక (4) అనే బాలిక భవనం కిటికీకి వేలాడుతూ కనిపించింది. ఆమె కేకలు విన్న స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా సమయంలో ఇంట్లో ఎవరు లేరని సమాచారం. సిబ్బంది ఆ ఇంటి తలుపులు పగలగొట్టి.. బాలికను సురక్షితంగా కాపాడారు. దాంతో పెను ప్రమాదం తప్పింది. చాలా సేపటి వరకు బాలిక కిటికీకి వేలాడుతూ ఉందని స్థానికులు చెప్పారు.