సంగారెడ్డి జిల్లా జిన్నారం మండల కేంద్రంలోని చాపల మార్కెట్ మందుబాబులకు అడ్డాగా మారింది. చేపల మార్కెట్ ను గత ప్రభుత్వం 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించింది. గ్రామానికి శివారులో భవనం ఉండటంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు బాటిల్స్ చెత్తాచెదారం వేస్తూ భవనాన్ని పాడు చేస్తున్నారు. నిరుపయోగ మారిన దానిని అందుబాటులోకి తీసుకురావాలని స్థానిక గ్రామస్తులు కోరుతున్నారు.