

నెల్లూరులో ఘనంగా ప్రారంభమైన రొట్టెల పండుగ (వీడియో)
AP: నెల్లూరులోని బారాషహీద్ దర్గా రొట్టెల పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. రొట్టెల పండుగలో పాల్గొనేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఐదు రోజుల పాటు రొట్టెల పండుగ జరగనుంది. కోరికల రొట్టెల కోసం దేశ, విదేశాల నుంచి భక్తులు చేరుకుంటున్నారు. స్వర్ణాల చెరువులో భక్తులు స్నానాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం భక్తుల కోసం టెంట్లు, తాగునీరు, ఉచిత భోజన ఏర్పాట్లు చేసింది. దర్గా ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది.