సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం నల్లవల్లి గ్రామంలో డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 94 రోజులు రిలే నిరసన దీక్ష శుక్రవారం కొనసాగించారు. గుమ్మడిదల మున్సిపాలిటీ నల్లవల్లి గ్రామ పరిధిలోని ప్యారా నగర్ గ్రామంలో డంపింగ్ యార్డ్ వద్దంటూ గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు. డంపింగ్ యార్డ్ రద్దు అయ్యేంతవరకు పోరాటం ఉధృతం చేస్తామని జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.