జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామిక వాడలోని పలు రసాయన పరిశ్రమలు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా వాయు కాలుష్యానికి కారణమవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున పారిశ్రామిక వాడలోని పలు పరిశ్రమలు యథేచ్ఛగా వాతావరణంలోకి ఫ్యాక్టరీ గొట్టాల ద్వారా విష వాయువులను విడుదల చేయడంపై స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు. విష వాయువులను నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తున్నారు.