జిన్నారం మండల కేంద్రంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టిఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వెంకటేశం గౌడ్ హాజరయ్యారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. భారత రాజ్యాంగం రచించిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ గౌడ్, నిఖిల్ తదితరులు ఉన్నారు.