రైతు గుర్తింపు కార్డు కోసం వ్యవసాయ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. శనివారం జిన్నారం మండల కేంద్రంలోని వ్యవసాయ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. ప్రతి ఒక్క రైతులు తన రైతు గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఆధార్ కార్డు, సెల్ఫోన్ తదితర పత్రాలతో వ్యవసాయ కార్యాలయంలో సంప్రదించాలని మండల రైతులకు ఏ ఓ సూచించారు.