సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు సంఘం అధ్యక్షులు సదానంద రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ప్యారా నగర్ లో డంపు యార్డు వద్దంటూ నిరసన తెలిపారు. నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆందోళనకారులు తదితరులు పాల్గొన్నారు.