గుమ్మడిదల మండలం అన్నారం పరిధిలో శుక్రవారం జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో ఇటుక బట్టీలలో విద్యార్థులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంఘం నాయకులు బాలికల విద్యా ప్రాధాన్యతను గురించి వివరించారు. యువజన సంఘాల నాయకులు మాట్లాడుతూ బాలికలు బాగా చదివి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని అన్నారు. వారి అభివృద్ధి సమాజ అభివృద్ధి అన్నారు.