సంగారెడ్డి: దాసాంజనేయ మందిరంలో జయంతి వేడుకలు

52చూసినవారు
హనుమాన్ జయంతి సందర్భంగా సంగారెడ్డి లోని పురాతన దాసాంజనేయ మందిరంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని శనివారం రాత్రి నిర్వహించారు. భక్తులు గంటపాటు 11 సార్లు హనుమాన్ చాలీసా ను చదివారు. అంతకుముందు హనుమంతునికి ప్రత్యేక పూజా కార్యక్రమాలను జరిపించారు. హనుమంతునికి మహా హారతి, నైవేద్యం సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్