కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో మార్నింగ్ వాక్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి నిర్వహించారు. కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి అండగా నిలవాలని అయన కోరారు. గ్రాడ్యుయేట్ లు తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, వాకర్స్, తదితరులు ఉన్నారు.