బొల్లారం పారిశ్రామిక వాడలోని పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి ఆవరణలో మొక్క నాటారు. పోలీస్ స్టేషన్ క్రైమ్ రికార్డులను పరిశీలించారు. నేరాల కట్టడికి కృషి పారిశ్రామిక వాడల్లో పెట్రోలింగ్ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పి సంజీవరావు, డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ గంగాధర్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.