హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ రథోత్సవ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ పటాన్‌చెరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఆదర్శ్ రెడ్డి కోరారు. జిన్నారంలో శనివారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం నుంచి పదివేల మందికి పైగా నాయకులు, కార్యకర్తలు తరలిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొలన్ బాల్ రెడ్డి పాల్గొన్నారు.