సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం జిన్నారం మండలం వావిలాల గ్రామంలోని సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని పీర్ష చెరువు కట్ట పై వావిలాల - జంగంపేట గ్రామాలను కలుపుతూ సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టారు. సీసీ రోడ్డు నిర్మాణాలు పూర్తిచేసుకుని గ్రామస్తులకు త్వరలోనే రోడ్డు అందుబాటులోకి రానుంది. సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.