నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సీఎం సహాయనిది ఆపన్న హస్తంగా నిలుస్తోందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం ఉదయం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో. నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లకు సంబంధించిన 48 మంది లబ్ధిదారులకు మంజూరైన 22 లక్షల 10 వేల రూపాయల విలువైన చెక్కులను స్థానిక నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు.