సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పటాన్‌చెరు పట్టణంలో హనుమాన్ శోభాయాత్రను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని శాంతినగర్, జేపీ కాలనీ, రామ్ మందిర్ రోడ్డు, తదితర కాలనీలలోని హనుమాన్ దేవాలయాలను ఎమ్మెల్యే దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.