కంకర క్రషర్ కు అనుమతులు ఇవ్వద్దు

73చూసినవారు
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం నల్తూరు గ్రామస్థులు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. నల్తూరులో కంకర క్రషర్ పెట్టడం ద్వారా ప్రజలకు ఇబ్బందులు జరుగుతాయని లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చిన జిన్నారం తహశీల్దార్ కి గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కంకర క్రషర్ పెట్టడం వల్ల కలిగే నష్టాలను మాజీ సర్పంచ్ జనార్ధన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేష్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్