నల్లవల్లి గ్రామంలో ఆదివారం ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా 131వ, రోజు రిలే నిరసన దీక్షలు గ్రామస్తులు కొనసాగించారు. గుమ్మడిదల మున్సిపాలిటీ నల్లవల్లి గ్రామ పరిధిలోని ప్యారా నగర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయాలంటూ గ్రామస్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఇక్కడి ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు.