జిన్నారంలో బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి వరి కొనుగోలు కేంద్రంలోని వరి ధాన్యం తడిసిపోయాయి. అకాల వర్షంతో వరి ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చేతికొచ్చిన పంట ఇలా వర్షం పాలు కావడంతో రైతులు ఆవేదన చెందారు. అధికారులు స్పందించి తడిసిన ధాన్యానికి కొనుగోలు చేయాలని స్థానిక రైతులు వాపోయారు.