బొల్లారం మున్సిపాలిటీ పరిధిలోని కేబీఆర్ కాలనీలో గల భవాని శంకర సాయి సన్నిధి ఆలయంలో ఈనెల 21వ తేదీన గురు పౌర్ణమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కోలన్ బాల్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 21వ తేదీ తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరారు.