సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి శనివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని పెద్దమ్మ గూడెం, జంగంపేట, మంగంపేట, ఊట్ల తదితర గ్రామాల నుండి పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి బైక్ ర్యాలీ నిర్వహించారు. జై హనుమాన్ జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.