టిజిఐఐసి చైర్మన్ గా భాద్యతలు స్వీకరించిన నిర్మల జగ్గారెడ్డిని నీలం మధు హైదరాబాద్ బషీర్ బాగ్ లోని వారి కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గురువారం పూల బొకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ. పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందిన సంగారెడ్డి జిల్లాకు టిజిఐఐసి చైర్మన్ పదవి దక్కడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.