సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలో గురువారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. మండల పరిధిలోని నల్తూర్, కొర్లకుంట, మంత్రి కుంట, గడ్డపోతారం, వావిలాల, జంగంపేట్ తదితర గ్రామాలలో మోస్తారు వర్షం పడింది. దీంతో రోడ్లపై వర్షపు నీరు చేరి బురదమయంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయ ఏర్పడింది. వర్షంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు