జిన్నారం మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. మండల పరిధిలోని ఊట్ల, రాళ్లకత్వ, శివానగర్, కొడకంచి, సొలక్ పల్లి తదితర ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమం మారాయి. పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడ్డారు.