సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ జిన్నారం మండల కేంద్రంలో ఆదివారం మధ్యాహ్నం మోస్తారు వర్షం కురిసింది. వాతావరణంలో ఒకసారిగా మార్పులు చోటుచేసుకుని మోస్తారు వర్షం పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. ఉదయం ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ వర్షం కురవడంతో వాతావరణం ఒక్క సారిగా చల్లబడింది. అకాల వర్షంతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బందులు పడ్డారు.