సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో మిషన్ ఇంద్ర ధనస్సు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ సర్వే చేపట్టారు. బుధవారం ఆశా వర్కర్ నాగమణి మాట్లాడుతూ. మిషన్ ఇంద్రధనస్సు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ ఎంఐ నంబర్ వేస్తున్నారు. పుట్టిన పిల్లల నుంచి 05 సంవత్సరాలలోపు పిల్లలకు ఫిబ్రవరి 21 నుంచి టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.